: వచ్చే ఏడాది పాక్ లో మోదీ పర్యటన... రాజ్యసభలో సుష్మా ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది పాకిస్థాన్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పెద్దల సభ రాజ్యసభలో ఆమె ఇటీవలి తన పాక్ పర్యటనపై ప్రకటన చేశారు. 2016లో పాక్ లో జరగనున్న ఓ అంతర్జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని సుష్మా చెప్పారు. ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య తిరిగి సత్సంబంధాల దిశగా అడుగులు పడటం శుభ పరిణామమని ఆమె పేర్కొన్నారు.