: భారత లౌకికవాదుల వంచన: తస్లిమా నస్రీన్ సంచలన వ్యాఖ్య
ఇండియలో లౌకికవాదుల పేరిట చెప్పుకునే వారు వంచనకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన 'లజ్జ' పుస్తకాన్ని హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అమ్మకానికి ఉంచితే, ముస్లిం మతాన్ని ఇష్టపడే కొందరు వచ్చి రాద్ధాంతం చేశారని చెబుతూ, ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తన పుస్తకాన్ని బంగ్లాదేశ్ లో నిషేధించారే తప్ప, ఇండియాలో కాదన్న విషయాన్ని వారు మరచిపోయారని అన్నారు. ఇది కూడా అసహనమేనని ఇండియాలోని ఏ లౌకికవాద రచయితా, దీనిపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించినట్టు తాను వినలేదని అన్నారు. సెక్యులరిస్టులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తన పుస్తకం అమ్మకాలను అడ్డుకున్న వారు అబద్ధాలు చెబుతున్నారని, ఇస్లాంను విమర్శించని అరుదైన పుస్తకం 'లజ్జ' అని తెలిపారు.