: ప్రముఖ సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి మరణించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నటుడు చిరంజీవి, శ్రేదేవి కాంబినేషన్ లో దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' చిత్రానికి ఆయన మూలకథ అందించారు. ఇంకా 'పెళ్లి', 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'అన్నదమ్ముల సవాల్' వంటి చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం తెలుపుతున్నారు.