: ఫొటోలు మార్ఫింగ్ చేసి, యువతులతో జల్సాలు చేస్తున్నానంటారా?: బోడె ప్రసాద్ కన్నీరు
బెజవాడలో రాజకీయ ప్రకంపనలు పుట్టించిన కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం నేత బోడె ప్రసాద్ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తాను తన కుటుంబ సభ్యులతో కలసి విదేశాలకు వెళ్లి ఫోటోలు దిగి, సామాజిక మాధ్యమాల్లో పెడితే, తమవారి ముఖాలను మార్ఫింగ్ చేసి అమ్మాయిలతో జల్సాలు చేస్తున్నానని ప్రచారం చేశారని ఆరోపించారు. కాల్ మనీ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయంలో సీబీఐ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. తనపై ఉన్న ఒక్క ఆరోపణ రుజువైనా పదవికి రాజీనామా చేస్తానని, ఎటువంటి శిక్షకైనా సిద్ధమని తెలిపారు. కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడం కూడా తప్పేనా? అని ప్రశ్నించిన ఆయన, తనను రాజకీయంగా అణగదొక్కేందుకే తన పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. వెనిగళ్ల శ్రీకాంత్ తనకు మిత్రుడు మాత్రమేనని మరోసారి చెప్పిన ఆయన, తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదని అన్నారు.