: దిలీప్ కుమార్ ఇంటికి నడిచి వచ్చిన ‘పద్మ విభూషణం’


బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ ఇంటికి ‘పద్మ విభూషణం’ నడిచి వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ అవార్డు గ్రహీతల్లో దిలీప్ కుమార్ కూడా ఉన్నారు. అయితే తీవ్ర అనారోగ్య కారణాల వల్ల అవార్డుల ప్రదానోత్సవానికి దిలీప్ కుమార్ హాజరు కాలేకపోయారు. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టే పరిస్థితిలో దిలీప్ కుమార్ లేరని నిర్ధారించుకున్న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణాన్నే ఆయన ఇంటికి పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు నిన్న ముంబై వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేరుగా దిలీప్ కుమార్ ఇంటికి వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులు వెంట రాగా పద్మ విభూషణ్ అవార్డును దిలీప్ కుమార్ కు అందజేశారు. పరిస్థితిని అర్థం చేసుకుని దిలీప్ కుమార్ ఇంటికి వచ్చి రాజ్ నాథ్ సింగ్ అవార్డును అందజేయడంపై బాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News