: మరికాసేపట్లో బెజవాడకు కేసీఆర్... హెలికాప్టర్ లో బయలుదేరనున్న తెలంగాణ సీఎం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని తాను నిర్వహిస్తున్న అయుత ఛండీయాగానాకి ఆహ్వానించేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు విజయవాడ వెళుతున్నారు. నేటి ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ కలవనున్నారు. దాదాపు గంటన్నర పాటు కేసీఆర్ అక్కడే ఉంటారు. అనంతరం చంద్రబాబు ఏర్పాటు చేసిన విందును ఆరగించిన తర్వాత తన మొక్కును తీర్చుకునేందుకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో తాను మొక్కుకున్న మేరకు అమ్మవారికి ఆయన ముక్కుపుడకను సమర్పించనున్నట్టు తెలుస్తోంది.