: దాయాదుల పోరు ముగిసిన అధ్యాయమే!... పీసీబీ చీఫ్ షహర్యార్ నిర్వేదం
ప్రపంచ క్రికెట్ లో దాయాదుల పోరుగా వినుతికెక్కిన భారత్-పాక్ క్రికెట్ సిరీస్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దాదాపుగా ఆశలు వదిలేసుకుంది. ఈ నెలాఖరులో జరగాల్సిన భారత్-పాక్ సిరీస్ ముగిసిన అధ్యాయమేనని పీసీబీ చీప్ షహర్యార్ ఖాన్ నిన్న ప్రకటించారు. సిరీస్ కు ఒప్పుకునేందుకు భాతర క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తాము ఇచ్చిన గడువు ముగిసిపోయిందని ప్రకటించిన ఆయన, ఇంతటితో ఈ సిరీస్ ను వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సిరీస్ కు ఒప్పుకోకపోతే, టీమిండియాతో జరిగే అన్ని మ్యాచ్ లను బహిష్కరించనున్నట్లు ఆయన గతంలో రాసిన లేఖలో బీసీసీఐకి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ లు ప్రమాదంలో పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది.