: అంగరంగ వైభవంగా రోహిత్ పెళ్లి... క్యూ కట్టిన క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు
టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తన ఎండార్స్ మెంట్ వ్యవహారాలను చూస్తున్న రితిక సజ్దేను అతడు నిన్న పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోని తాజ్ ల్యాండ్ హోటల్ లో వేడుకగా జరిగిన ఈ వివాహానికి క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు క్యూ కట్టారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దంపతులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ యజమాని ముఖేశ్ అంబానీ కుటుంబ సమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యారు. రోహిత్ పెళ్లికి టీమిండియా క్రికెటర్లు కూడా దాదాపుగా అందరూ హాజరయ్యారు.