: ఆడియో వేడుకలో బర్త్ డే కేక్ కట్ చేసిన రెజీనా
‘సౌఖ్యం’ సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో నటి రెజీనా బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్రయూనిట్ బర్త్ డే సాంగ్ ను పాడుతుండగా రెజీనా కేక్ ను కట్ చేసింది. అనంతరం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గోపీచంద్, రెజీనాలు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. కాగా, ఈ చిత్రంలోని రెండో సాంగ్ ను సీనియర్ నటుడు గిరిబాబు లాంచ్ చేశారు. ఈ పాట లాంచ్ చేయడానికి ముందుగా రెజీనా బర్త్ డే కేక్ కట్ చేసింది.