: ఢిల్లీ విమానం కోసం ప్రయాణికుల పడిగాపులు !


ఢిల్లీ విమానం కోసం గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. ఈరోజు సాయంత్రం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాలతో హైదరాబాద్ లో నిలిచిపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. కాగా, సంబంధిత శాఖాధికారులు మాట్లాడుతూ, సాంకేతిక కారణాలతో విమానం నిలిచిపోయిందని... క్లియరెన్స్ రాగానే ఇక్కడికి చేరుకుంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News