: హాస్యనటుడు బ్రహ్మానందానికి సన్మానం


హాస్యనటుడు బ్రహ్మానందంను గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానించారు. నరసరావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం, గాయకుడు గజల్ శ్రీనివాస్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయిలను గవర్నర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News