: విజయవాడలో కాల్ మనీ మహిళా గ్యాంగ్ అరెస్ట్!
విజయవాడలో కాల్ మనీ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటపడింది. ఈ వ్యాపారం నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సూరం నాగరత్నం, సూర్యదేవర పద్మ, యామిని ప్రమీల, మల్లాది జానకమ్మలు కాల్ మనీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వందలాది మహిళలు వీరి బారిన పడ్డారు. బాధితుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తతంగం బయటపడింది. కాగా, నాగరత్నం కుమారుడు మణికంఠ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. నాగరత్నం అతనితో కలిసి ఈ వ్యాపారం చేస్తోంది. ఆమె కొడుకు కానిస్టేబుల్ కావడంతో సదరు బాధిత మహిళలు భయపడి నోరుమెదపకుండా వడ్డీలు చెల్లిస్తుండేవారని సమాచారం.