: ఏటీఎం ఇలా పని చేస్తుంది!


ఏటీఎం నుంచి మనకు కావాల్సిన మొత్తాన్ని తీసుకుని చక్కగా జేబులో పెట్టుకుని వెళ్లిపోతుంటాము. కానీ, ఆ మెషీన్ పనితీరు గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే, దాంతో మనకు అవసరం లేదు కనుక. అయితే, మనం ఉపయోగించే వస్తువుల పని తీరు గురించి మినిమమ్ తెలుసుకుని ఉండటం మంచిది. ఏటీఎంలో కార్డు ఇన్ సర్ట్ చేసిన తర్వాత జరిగే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే... * ఏటీఎం కార్డు వెనుక భాగంలోని మ్యాగ్నెటిక్ బార్ లో ఉన్న సమాచారం మొత్తం బ్యాంక్ సర్వర్ కు వెళుతుంది. * ఆ సమాచారం కరెక్టుగా ఉంటే.. తిరిగి ఏటీఎంలోని కంప్యూటర్ కు చేరుతుంది. * సదరు పిన్ నంబర్ ను టైపు చేసిన తర్వాత కూడా మళ్లీ ఇదే ప్రక్రియ మరోసారి జరుగుతుంది. * మనకు ఎంత డబ్బు కావాలో ఆ సంఖ్యను ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎంల క్యాష్ బాక్స్ ల వద్ద పని ప్రారంభమవుతుంది. * క్యాష్ బాక్స్ ల చివరన ఉన్న మూత తెరచుకుంటుంది. * లైట్ సెన్సర్లు, క్యాష్ బాక్స్ కు అనుసంధానమైన యంత్రాల ద్వారా డబ్బు లెక్కింపు జరుగుతుంది. * క్యాష్ బాక్స్ ల పైభాగంలో ఉండే రోలర్ల మధ్య నుంచి కరెన్సీ నోట్లు బయటకు వస్తాయి. * ఒకవేళ నకిలీ లేదా నలిగిపోయిన నోట్లు వస్తే వాటిని వేరే బాక్స్ లోకి పడేసే విధంగా టెక్నాలజీ ఉంటుంది.

  • Loading...

More Telugu News