: దేశరాజధానిని వణికిస్తున్న చలి!


దేశ రాజధాని ఢిల్లీలో చలి రోజురోజుకీ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గిపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. రోజుకి మూడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత శుక్రవారంతో పోలిస్తే శని, ఆదివారాల్లో నాలుగు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈరోజు ఉదయం 6.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీ గ్రేడ్ నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గడచిన మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి కొద్దిగా ఆలస్యంగా ఢిల్లీలో చలి ప్రారంభమైనప్పటికీ రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు పొగమంచు కమ్మివేస్తుండటంతో జనజీవనానికి తీవ్రమైన ఆటంకం కల్గుతోంది. స్థానిక బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News