: తెల్లపులి పిల్లలకు పేర్లు పెట్టిన ‘అమ్మ’


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెల్లపులి పిల్లలకు పేర్లు పెట్టారు. నమృత అనే తెల్ల పులికి కొత్తగా నాలుగు తెల్ల పులిపిల్లలు జన్మించాయి. వీటిలో రెండు మగవి కాగా, రెండు ఆడ పిల్లలు ఉన్నాయి. రెండు మగ పులిపిల్లలకు దేవా, నకులా అని, ఆడపులిపిల్లలకు కాలా, మాలా అని జయలలిత నామకరణం చేశారు. చెన్నైలోని వండలూర్ లోని అరిగ్నార్ అన్నా జూపార్క్ ను ఆమె సందర్శించారు. కాగా, ఈ ఏడాది జూన్ లో నాలుగు తెల్ల పులి పిల్లలకు ఆమె నామకరణం చేసింది.

  • Loading...

More Telugu News