: తిరుమల నడకదారిలో చేప మాంసం అమ్మకం... నలుగురి అరెస్ట్!


పవిత్రమైన తిరుమల గిరులపై అన్ని రకాల మద్య, మాంసాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు పూర్తిగా నిషేధం. అటువంటి చోట పట్టపగలు చేప మాంసం, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ఘటన నేడు సంచలనం కలిగించింది. తిరుమల నడక దారిలో మాంసం అమ్ముతున్నట్టు తెలుసుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చేపలను, సిగరెట్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ తరహా ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News