: శ్రీకాంత్, నేను కలిసే విదేశాలకు వెళ్లాం!: 'కాల్ మనీ' కేసుపై టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్


కాల్ మనీ రాకెట్ లో కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ తో కలసి బోడె ప్రసాద్ విదేశాలకు వెళ్లినట్టు వస్తున్న వార్తలపై ప్రసాద్ తొలిసారిగా స్పందించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఓ టెలివిజన్ చానల్ తో మాట్లాడుతూ, తాము ఇద్దరమూ కలిసి విదేశాలకు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే, కాల్ మనీ కేసు బట్టబయలు అయిన తరువాత, శ్రీకాంత్ తనకు చెప్పకుండా వెళ్లిపోయాడని అన్నారు. శ్రీకాంత్ మరో దేశానికి వెళ్లి ఉండవచ్చని, ఆ సమాచారం తనకు తెలియదని అంటున్నారు. కాగా, వీరిద్దరూ విదేశాల్లో కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఇక శ్రీకాంత్ దొరికినా, బోడె ప్రసాద్ విదేశాల నుంచి వచ్చినా, కేసులో మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News