: ఆరుషి కేసులో అధికారి చెప్పిన వాస్తవం


టీనేజర్ ఆరుషి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఎజీఎల్ కౌల్ నేడు సంచలనాత్మక విషయాలు కోర్టుకు వెల్లడించారు. ఆరుషి హత్య కేసులో ఆమె తల్లి నూపుర్ పై స్పష్టమైన ఆధారాలున్నా, తన పైఅధికారులు ఒత్తిడి వల్లే ఆమెను అరెస్టు చేయలేదని కౌల్ తెలిపారు. తాను నూపుర్ ను అరెస్టు చేస్తానన్నా సీనియర్ అధికారులు నీలభ్ కిశోర్, జావేద్ అహ్మద్ అడ్డుకున్నారని ఆయన వివరించారు. తగిన ఆధారాలున్నా నూపుర్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రత్యేక కోర్టు అడిగిన ప్రశ్నకు కౌల్ పైవిధంగా జవాబిచ్చారు.

2008లో 14 ఏళ్ళ ఆరుషి నోయిడాలోని తన ఇంట్లోనే హత్యకు గురైంది. తొలుత ఈ హత్య పనివాడు హేమరాజ్ పనిగా భావించినా అతని మృతదేహం కూడా టెర్రస్ పై కనిపించడంతో కేసు సంచలనాత్మకంగా మారింది. దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆరుషి తల్లిదండ్రులే ఈ హత్యలకు పాల్పడ్డట్టు పేర్కొన్నా.. కోర్టులో నిరూపించడంలో ఇంకా సఫలం కాలేదు. ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News