: షాపు యజమాని పొరపాటుతో అదృష్టం తన్నుకొచ్చిన వేళ, రూ. 10 కోట్ల లాటరీ!
అదృష్టం తన్నుకు వస్తే అలానే ఉంటుంది మరి. లాటరీ టికెట్లు కొనుక్కునే అలవాటున్న ఓ లారీ డ్రైవర్ కు పొరపాటున అడిగిన టికెట్ ఇవ్వకుండా, మరో టికెట్ ను లాటరీ షాపు యజమాని ఇవ్వగా, ఇంటికెళ్లి తిట్టుకున్నా, ఆపై ఆ టికెట్ కు మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) ప్రైజ్ మనీ వచ్చిన ఘటన బ్రిటన్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, స్టాన్ ఫోర్డ్ షైర్ కు చెందిన స్టూవర్ట్ పావెల్ అనే వ్యక్తి లారీలను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. తనకున్న అలవాటుతో ఓ లాటరీ టికెట్ ను కొనేందుకు వెళ్లి, అడిగిన టికెట్ కాకుండా, మరో రోజున డ్రా ఉన్న టికెట్ ను పొరపాటున తీసుకు వచ్చేశాడు. ఆపై ఫలితాల రోజు షాపు యజమానిని తిట్టుకున్నాడు కూడా. తిరిగి తన చేతిలోని లాటరీ టికెట్ కు బహుమతి లభించిందని భార్య చెబితే విని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఏమైనా షాపు యజమాని చేసిన పొరపాటు పావెల్ కు అదృష్టాన్ని దగ్గర చేసింది. ఈ డబ్బుతో కొడుకులకు ఇళ్లు కొంటానని ఇప్పుడు పావెల్ అంటున్నాడు.