: ఉద్యోగులు ఆనందంగా గడిపే టెక్ కంపెనీలివే!


ఉద్యోగులు ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా విధులు నిర్వహిస్తుంటే మరింత ప్రొడక్టివిటీ పెరుగుతుందని నమ్ముతున్న ఎన్నో టెక్నాలజీ కంపెనీలు వారికి కావాల్సిన సమస్త సౌకర్యాలనూ కల్పిస్తున్నాయి. ఉచిత ఫుడ్ కోర్టుల నుంచి సేదదీరేందుకు స్విమ్మింగ్ పూల్స్, ఆడుకునేందుకు ఇండోర్ గేమ్స్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఆనందంగా పనిచేస్తున్న కంపెనీల జాబితాను జాబ్ హంటింగ్ వెబ్ సైట్ 'గ్లాస్ డోర్' ప్రకటించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో గూగుల్, ఫేస్ బుక్ స్థానం పొందలేకపోయాయి. ఉద్యోగులను ఆనందంగా ఉంచుతున్న కంపెనీల్లో కొత్తవి వచ్చి చేరాయి. ఆ వివరాలు... 1. ఎయిర్ బీఎన్బీ - రేటింగ్ 4.6: యాత్రికులకు, టూరిస్టులకు ట్రావెల్ సేవలందిస్తున్న సంస్థ ఇది. ఇక్కడి కల్చర్ ఎంతో బాగుంటుందని ఉద్యోగులు అంటుంటారు. 2. గైడ్ వైర్ - రేటింగ్ 4.5: బీమా కంపెనీలకు అవసరమయ్యే సాఫ్ట్ వేర్ ను ఈ సంస్థ తయారు చేస్తుంటుంది. ఇక్కడ ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. 3. హబ్ స్పాట్ - రేటింగ్ 4.4: సేల్స్, మార్కెటింగ్ రంగానికి అవసరమైన సాంకేతికతను అందిస్తుంది. పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా, దాన్ని అధిగమించేంతటి సదుపాయాలను యాజమాన్యం కల్పించిందన్నది ఉద్యోగుల అభిప్రాయం. 4. ఫేస్ బుక్ - రేటింగ్ 4.4: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్న సంస్థగా ఫేస్ బుక్ అందరికీ సుపరిచితమే. ఇక్కడ పనిచేస్తుంటే మిగతా కంపెనీల కన్నా మంచి ప్రోత్సాహకాలతో పాటు ఆనందంగా గడపవచ్చట. 5. లింక్డ్ ఇన్ - రేటింగ్ 4.4: ఇది ఓ జాబ్ హంటింగ్ సైట్. సామాజిక మాధ్యమంగానూ సేవలందిస్తోంది. ఇక్కడ ఉద్యోగులు ఎలా కావాలంటే అలా వుండవచ్చు. 6. గూగుల్ - రేటింగ్ 4.3: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ సెర్చింజన్ నిర్వహిస్తున్న సంస్థ. ఉద్యోగులను ఆనందంగా ఉంచాలన్న సంస్కృతి ఇక్కడి నుంచే మొదలైంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఉచిత ఆహారం, మసాజ్, జిమ్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి. 7. జిల్లో - రేటింగ్ 4.3: ఆన్ లైన్ మాధ్యమంగా రియల్ ఎస్టేట్ సేవలందిస్తున్న సంస్థ. ఇక్కడ ఆహారంతో పాటు స్నాక్స్, డ్రింక్స్ ఉచితం. ఉద్యోగులకు యాజమాన్యం ఎంతో అండగా ఉంటుందట. 8. వరల్డ్ వైడ్ టెక్నాలజీ - రేటింగ్ 4.3: టెక్నాలజీ కన్సల్టింగ్ సేవలందిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి పని ముగించుకు రావచ్చు. ఓ కుటుంబ వాతావరణం ఇక్కడ కనిపిస్తుందట. ఉద్యోగులకు ప్రోత్సాహకాలూ అధికమే. 9. మైండ్ బాడీ - రేటింగ్ 4.2: అపాయింట్ మెంట్ ఆధారిత వ్యాపారాలకు సాఫ్ట్ వేర్ ను తయారు చేస్తున్న సంస్థ ఇది. ఇక్కడ ఉద్యోగులు పాజిటివ్ గా ఉంటూ, వ్యక్తిగత అవసరాలన్నీ తీర్చుకునేలా వాతావరణం ఉంటుందట. 10. ఎక్స్ పీడియా - రేటింగ్ 4.1: ఆన్ లైన్ లో ట్రావెలింగ్ సేవలందిస్తున్న సంస్థ. ఇక్కడ పనిచేసే వాతావరణం ఉద్యోగులు అందరికీ నచ్చేలా ఉంటుందట. వీటితో పాటు రియాట్ గేమ్స్ (4.1), అడోబ్ (4.1), యాపిల్ (4), ట్విట్టర్ (4), పేకామ్ (4), అకామై (4), సేల్స్ ఫోర్స్ (4), ఎఫ్5 నెట్ వర్క్స్ (4), వర్క్ డే (4), రెడ్ హ్యాట్ (4) తదితర సంస్థలు ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు పెద్ద పీట వేస్తున్నాయని గ్లాస్ డోర్ వెల్లడించింది. (వీటి ర్యాంకులు 'అవుటాఫ్ 5' ప్రాతిపదికన ఇచ్చినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News