: మరింత సెక్యూరిటీతో ఎస్బీఐ డెబిట్ కార్డులు


రోజురోజుకూ ఆన్ లైన్ మోసాలు, డెబిట్ కార్డుల మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కస్టమర్లకు మరింత భద్రతను ఇచ్చేలా ఈఎంవీ చిప్ ఉండే డెబిట్ కార్డులను అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. వీటి వాడకం మూలంగా కార్డుల స్కిమ్మింగ్ కు అడ్డుకట్ట వేయవచ్చని, పాత ఖాతాదారులందరికీ, ఈ కార్డులను అందిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఇందుకోసం ఖాతా ఉన్న శాఖకు వెళ్లి, నామమాత్రపు ఫీజు చెల్లించి, మరింత సెక్యూరిటీని ఇచ్చే డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సి వుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ సూచనల ప్రకారం, ఈఎంవీ కార్డుల జారీకి నిర్ణయించామని బ్యాంకు కార్పొరేట్ వ్యూహం విభాగం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మంజూ అగర్వాల్ వెల్లడించారు. కాగా, ఆర్బీఐ గణాంకాల ప్రకారం, భారత డెబిట్ మార్కెట్లో 38.41 శాతం మార్కెట్ వాటా ఎస్బీఐదే.

  • Loading...

More Telugu News