: పేరు వెల్లడించకుండా... డొనాల్డ్ ట్రంప్ పై సుందర్ పిచాయ్ విమర్శలు!


తదుపరి అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ ఖండించారు. ఎవరి పేరునూ వెల్లడించకుండా, తన బ్లాగులో "భయం చేతిలో మన విలువలు పరాజయం పాలు కాకుండా చూసుకుందాం. మనం యూఎస్ లోని, ప్రపంచంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది" అని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో అసహనానికి సంబంధించిన వార్తలు పెరిగిపోతున్నాయని, భవిష్యత్తుకు ఇది మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, యూఎస్ లోకి ఏ ముస్లిం కూడా కాలు మోపకుండా చూడాలని గత వారం డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్, అమేజాన్ చీఫ్ జెఫ్ బేజాస్ తదితరులు ఖండించారు.

  • Loading...

More Telugu News