: "రౌడీ షీటర్ గారూ..." అంటూ దిమ్మ తిరిగేలా ఎటాక్ చేసిన అమలాపురం పోలీసులు!


అమలాపురం పోలీసుల ఎటాకింగ్ కు ఆ రౌడీ షీటర్ దిమ్మ తిరిగిపోయింది. ప్రజలకు ఇబ్బందిగా మారిన ఆ రౌడీషీటర్ జన్మదినం సందర్భంగా పట్టణ పోలీసులు తమదైన రీతిలో ఎటాక్ చేశారు. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రౌడీ గ్యాంగుల సంఖ్య అధికం. వాటిల్లో కొలగాని స్వామినాయుడు గ్యాంగు కూడా ఉంది. నిన్న అతని పుట్టిన రోజు కాగా, కొలగాని అనుచరగణం పట్టణ వ్యాప్తంగా భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. రౌడీషీటర్ల పట్ల కఠినంగా ఉండే సీఐ శ్రీనివాస్ కు విషయం తెలిసి సీరియస్ అయ్యారు. అతనికి ఓ ఝలక్ ఇవ్వాలని ఆలోచించిన సీఐ... ఓ చిన్న ప్లెక్సీపై క్రికెట్ బ్యాటు, రక్తంతో తడిసిన కత్తి, స్వామినాయుడి చిత్రాన్ని ముద్రించి, "రౌడీ షీటర్ గారు... శ్రీ కొలగాని నాయుడుగారు, ఎట్ నాయుడు గారు... ఇట్లు అమలాపురం టౌన్ పోలీస్" అంటూ ప్రింట్ చేయించి, అప్పటికే అక్కడ వెలసిన భారీ ప్లెక్సీపై దీనిని అతికించి, సదరు రౌడీషీటర్ దిమ్మ తిరిగేలా చేశారు. ఇప్పుడు అమలాపురంలో ఈ ఘటనపై పెద్ద చర్చే జరుగుతోంది.

  • Loading...

More Telugu News