: 5 గంటల్లో రెండు లక్షల లైక్స్ కొల్లగొట్టిన సెల్ఫీ


సోషల్ మీడియాలో సెల్ఫీల హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేసి లైకులు, షేర్లు చూసుకుంటున్నారు. ఆ మధ్య ఫేస్ బుక్ లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తన భార్య మిరా రాజ్ పుత్ తో సెల్ఫీ తీసుకుని పోస్టు చేయగా, దానికి 24 గంటల్లో 12 లక్షల లైకులు వచ్చాయి. దీంతో అభిమానుల్లో షాహిద్ దంపతులకు ఉన్న క్రేజ్ కు అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా అదే జంట మరోసారి సెల్పీ తీసుకుని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ సారి కేవలం ఐదు గంటల్లో రెండు లక్షల లైక్స్ కొల్లగొట్టింది. దీంతో ఈ జంటకు ఆదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదని షాహిద్ అభిమానులు ముచ్చటపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News