: ఉగ్రవాదులను, ఇస్లాంను వేర్వేరుగా చూడండి: అమెరికన్లకు ఒబామా పిలుపు


ఉగ్రవాదులను, ఇస్లాంను వేర్వేరుగా చూడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. అమెరికాలోని శాన్ బెర్నార్డినోలో పాక్ సంతతికి చెందిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి, 14 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పోటీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్ ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అక్కడి ముస్లింలపై వ్యతిరేకత మొదలవుతోంది. దీనిని గ్రహించిన ఒబామా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, అమెరికన్లు ఇస్లాంకు వ్యతిరేకంగా మారకూడదని, ఉగ్రవాదులకు మాత్రమే వ్యతిరేకంగా మారాలని సూచించారు. ఉగ్రవాదులు చేసిన పనికి అందరినీ నిందించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. పారిస్, శాన్ బెర్నార్డినో దాడుల నేపథ్యంలో అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఐఎస్ ప్రజలను మతం పేరుతో విడదీయాలని చూస్తోందని, అమెరికన్లు దీనిని తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News