: క్రికెటర్ల గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన అంబానీలు


ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ గౌరవార్థం ఆ జట్టు యాజమాన్యం నీతూ అంబానీ, ముఖేష్ అంబానీలు ముంబైలో విందు ఏర్పాటు చేశారు. గత నెల హర్భజన్ సింగ్ బాలీవుడ్ నటి గీతా బాస్రాను వివాహం చేసుకోగా, రేపు రోహిత్ శర్మ ప్రియురాలు రితికను వివాహం చేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అంబానీలు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబ సమేతంగా హాజరుకాగా, టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కాబోయే భార్య హెజెల్ కీచ్ తో హాజరయ్యాడు. వీరే కాకుండా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సుస్మితా సేన్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, అమీషా పటేల్, డేవిడ్ ధావన్, మనీష్ మల్హోత్రా, సోఫీ చౌదరి తదితరులు హాజరయ్యారు. దీంతో, అద్భుతమైన విందు ఏర్పాటు చేసిన అంబానీ కుటుంబానికి హర్భజన్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా తన భార్యతో కేక్ కోస్తున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News