: ఐఎస్ఐఎస్ ను పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ భయం!


ఐఎస్ఐఎస్ ను ఎయిడ్స్ వ్యాధి పట్టి పీడిస్తోంది. ఇండోనేషియాకు చెందిన ఓ ఐఎస్ఐఎస్ తీవ్రవాది తనకు ఎయిడ్స్ ఉందన్న విషయం దాచిపెట్టి యాజాదీ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యాజాదీ మహిళలను బందీలుగా పట్టుకుని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వారిని సెక్స్ బానిసలుగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇండోనేసియా ఉగ్రవాది కారణంగా మొరాకోకు చెందిన ఇద్దరు మహిళలకు ఎయిడ్స్ సోకింది. దీంతో విషయం తెలియని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎయిడ్స్ బారినపడ్డారు. విషయం తెలిసిన తీవ్రవాదులు ఆ ఇండోనేసియా తీవ్రవాదిని కాల్చి చంపగా, మహిళలు మాత్రం పారిపోయారు. దీంతో ఇస్లామిక్ స్టేట్ సాధిస్తామని ప్రతినబూనిని తీవ్రవాదుల్లో ఎయిడ్స్ భయం పట్టుకుంది. ఇప్పటి వరకు 16 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఎయిడ్స్ పరీక్షల కిట్ల కొరత ఉన్నందున అందరికీ పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. దీంతో వాస్తవంగా ఎయిడ్స్ బారిన ఎంత మందిపడ్డారో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. ఎయిడ్స్ కు గురైన 16 మందిని ఆత్మాహుతి దాడులకు పంపించడానికి ఐఎస్ సమాయత్తమవుతోంది. దీంతో వారందరినీ దాడులకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News