: మ్యాగీపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు


నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ నూడిల్స్ పై గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మోతాదుకు మించిన పరిమాణంలో సీసం ఉందని... ఇది ఆరోగ్యానికి హానికరమని భారత ఆహార భద్రత సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో బాంబే హైకోర్టు సూచనల మేరకు ప్రయోగశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో మ్యాగీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో, మ్యాగీపై నిషేధం ఎత్తివేశారు. ఈ క్రమంలో అమ్మకాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టులో భారత ఆహార భద్రత సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. మ్యాగీ విషయంలో విచారణ చేబట్టాలని కోరింది.

  • Loading...

More Telugu News