: యువతి పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి బుక్ అయ్యాడు


యువతి పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి బుక్ అయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కొల్హాపూర్ తాలూకాలోని చాంద్ గఢ్ ప్రాంతానికి చెందిన పాండురంగ తేజమ్ (21) అనే యువకుడు గోవాకు చెందిన ఓ యువతి పేరుతో ఫేస్ బుక్ పేజ్ తెరిచారు. ఆ యువతికి చెందిన ఫోటోలు ఆ పేజ్ లో పోస్టు చేయడం, ఆ పేజ్ నుంచి తనకు తెలిసిన వారికి, బంధువులకు మెసేజ్ లు పెట్టడం చేసేవాడు. తన నకిలీ ఖాతా విషయం తెలుసుకున్న సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో అతని గుట్టు రట్టైంది. కేసు నమోదు చేసిన పోలీసులు పాండురంగ తేజమ్ ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News