: రెండు రోజుల్లో కేసీఆర్ ను కలుస్తా: విజయరామారావు
తెలుగుదేశం పార్టీకి నిన్న రాజీనామా చేసిన మాజీ మంత్రి విజయరామారావును... ఆయన నివాసంలో ఈ రోజు మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా, టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం విజయరామారావు మీడియాతో మాట్లాడుతూ, మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలసి పనిచేస్తానని చెప్పారు. పార్టీలోకి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.