: కాల్ మనీ నిందితులను వదలొద్దు: సీఎం చంద్రబాబు
విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ రాముడుకి ఫోన్ చేసి, కాల్ మనీ వ్యవహారంపై ఆరాతీశారు. ఈ ఘటనలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించవద్దని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. దీంతో, దర్యాప్తును వేగవంతం చేశామని, నిందితులను వదిలే ప్రసక్తి లేదని డీజీపీ తెలిపారు.