: ఆరవై ఐదవ పడిలోకి రజనీ... వెల్లువెత్తిన శుభాకాంక్షలు
ముక్కుసూటి డైలాగులు, తనదైన స్టైల్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈసారి చెన్నై వరదల నేపథ్యంలో జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్న ఆయనకు పలువురు సినీ నటులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రజనీ ఒక ఆదర్శ, నిరాడంబర వ్యక్తి అని కీర్తించారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దర్శకుడు బోయపాటి శ్రీను, వెంకటేశ్, అల్లు అర్జున్, నారా రోహిత్, సునీల్, బ్రహ్మాజీ, అనుష్క, మంచు లక్ష్మి, ఎంఎం శ్రీలేఖ, రజనీ అల్లుడు, తమిళ నటుడు ధనుష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రజనీ 'కబాలి' చిత్రం షూటింగ్ కోసం గోవాలో బిజీగా ఉన్నారని చిన్న కుమార్తె ఐశ్వర్య ట్విట్టర్ లో తెలిపారు. ఆయనకు కూతురుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానంటూ శుభాకాంక్షలు చెప్పింది.