: ఎమ్మెల్యే ఈశ్వరిపై కేసు పెట్టడం దారుణం: గుడివాడ అమర్ నాథ్
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఖండిస్తున్నారు. గిరిజనులు, ఆదివాసీల మనోభావాలను తెలియజేసిన ఆమెపై అక్రమంగా కేసు పెట్టడం దారుణమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి కానీ, ప్రజల తరపున మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈశ్వరిపై అన్యాయంగా ఐదు కేసులు పెట్టారని ఆరోపించారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు ఉన్నాయని, న్యాయం జరిగేంత వరకు వైసీపీ పోరాడుతుందని అమర్ నాథ్ చెప్పారు.