: కేసీఆర్ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు: కేటీఆర్


టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీ మారుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాదులో టీడీపీని వీడిన విజయరామారావును పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ ఎవర్నీ ప్రలోభపెట్డడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి పని తీరుపట్ల ఆకర్షితులై బంగారు తెలంగాణ సాధనలో భాగంగా టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే షబ్బీర్ అలీ బెదిరింపులపై మాట్లాడుతూ, తమ పార్టీలో అలాంటి సంస్కృతి లేదని అన్నారు. అలాంటి బెదిరింపులను తేలిగ్గా తీసుకునే అవకాశం లేదని, అలాంటి బెదిరింపులకు ఎవరు పాల్పడినా శిక్షార్హులేనని ఆయన చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News