: హైదరాబాదులో ఆటో డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
గుర్తు తెలియని కొంతమంది దుండగులు హైదరాబాద్ లో ప్రధాన రహదారిపై రెచ్చిపోయారు. జీడిమెట్లకు దగ్గరలోని షాపూర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్ పై వచ్చిన దుండగులు ఆటో డ్రైవర్ హనుమంతుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ వెంటనే పరారయ్యారు. దాంతో ఆటో పూర్తిగా దగ్ధమవగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిసేపటికి 108 వాహనంలో హనుమంతుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.