: చెన్నై వరద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం విడుదల
ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు, వరదల విలయానికి చనిపోయిన 23 మంది బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కొక్క కుటుంబానికి ప్రకటించిన రూ.4 లక్షల పరిహారాన్ని సీఎం జయలలిత విపత్తు సహాయ నిధి నుంచి ఈ రోజు విడుదల చేశారు. కాంచీపురం జిల్లాలో వర్షాలు కురిసిన మొదటి వారంలోనే ఈ మృతుల సంఖ్య నమోదైంది. ఇంకా గోడలు కూలడం, విద్యుత్తు షాక్, వరదల్లో కొట్టుకుపోవడం వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందలకుపైగా మరణించినట్టు సమాచారం.