: మోదీ వీసా రికార్డులు సమర్పించండి... అమెరికా హోంశాఖకు ఫెడరల్ కోర్టు ఆదేశం


ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్రమోదీ రెండుసార్లు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయంపై ఆ దేశ ఫెడరల్ కోర్టులో విచారణ మొదలైంది. మోదీ వీసాకు సంబంధించిన రికార్డులను సమర్పించాలంటూ ఆ దేశ హోంశాఖను న్యూయార్క్ లోని సదరన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశించారు. మోదీ అమెరికాలో ప్రవేశించడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అన్ని డాక్యుమెంటను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా అందజేయాలని జడ్జి తెలిపారు. తదుపరి విచారణ అదే నెల 29న జరుగుతుందని పేర్కొన్నారు. మోదీ వీసాకు సంబంధించిన జూన్ 2013లోని రికార్డులను సమర్పించాలని 'ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్ మేషన్' చట్టం కింద యూఎస్ కు చెందిన సిక్స్ ఫర్ జస్టిస్ అనే మానవ హక్కుల బృందం కోరినా హోంశాఖ ఇవ్వలేదు. దాంతో సెప్టెంబర్ లో ఆ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు స్పందించింది.

  • Loading...

More Telugu News