: ఇక మిగిలింది సగమే!... గులాబీ ఖాతాలో ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ సీట్లు


తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. నిన్నటిదాకా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ, తాజాగా మరో రెండు స్థానాలను కూడా ఎన్నికలు లేకుండానే తన ఖాతాలో వేసేసుకుంది. దీంతో మొత్తం 12 సీట్లలో ఇప్పటికే ఆరు గులాబీ పార్టీ పరమయ్యాయి. ఇక ఎన్నికలు జరగనున్న ఆరింటిలో మరిన్ని సీట్లపై ఆ పార్టీ గురిపెట్టింది. నిన్నటిదాకా వరంగల్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు వైదొలగడంతో ఆ నాలుగు సీట్లు టీఆర్ఎస్ కు దక్కాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. ఈ రెండు స్థానాలకు నామినేషన్లు వేసిన స్వత్రంత్ర అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవడంతో నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాదరావులు ఏకగ్రీవంగా మండలి సభ్యులుగా ఎన్నిక కానున్నారు.

  • Loading...

More Telugu News