: కొమరవోలులో చంద్రబాబు సతీమణి పర్యటన


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె కొమరవోలులో పర్యటించారు. తొలుత గ్రామంలోని ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత రూ. 11 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారిని ప్రారంభించారు. అనంతరం, స్థానికులతో గ్రామాభివృద్ధిపై సమావేశం నిర్వహించి... స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఇదే సమయంలో, డ్వాక్రా మహిళలకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, అధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News