: మాజీ మావోయిస్టు, మావో అగ్రనేత చంద్రన్న భార్య విడుదల


మాజీ మావోయిస్టు, మావోయిస్టు అగ్రనేత పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న భార్య మోతీబాయి అలియాస్ రాధక్క ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమెను జైలు బయట విరసం నేత వరవరరావు కలిసి పరామర్శించారు. రెండు సంవత్సరాల కిందట ఆమె అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందేందుకు కారులో హైదరాబాద్ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఖమ్మం, తరువాత వరంగల్, ఆ తర్వాత గత సంవత్సరం నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో ఆమె రాజకీయ ఖైదీగా ఉన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన 19 కేసుల్లో ఆమె నిర్దోషిగా తేలారు. అటు ఖమ్మంలో నమోదైన కేసుల్లో బెయిల్ రావటంతో విడుదలయ్యారు.

  • Loading...

More Telugu News