: షబ్బీర్ అలీకి బీజేపీ లక్ష్మణ్ బాసట... బెదిరింపులను సహించేది లేదని ప్రకటన


కేసీఆర్ పై విమర్శలు మానుకోకపోతే చంపేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి బెదిరింపులు వచ్చిన ఘటన తెలంగాణలో ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత, తెలంగాణలో ఆ పార్టీ నేత లక్ష్మణ్ కొద్దిసేపటి క్రితం షబ్బీర్ అలీని కలిశారు. బెదిరింపులపై ఆరా తీశారు. అండగా ఉంటామని షబ్బీర్ అలీకి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఆరోపణలు చేస్తే చంపేస్తామని బెదిరింపులు వస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులను ఇక ఎంతమాత్రం సహించబోమని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News