: సిరియాలో మరో భీకర దాడికి పాల్పడ్డ ఐఎస్... ట్రక్కు బాంబుల పేలుడులో 60 మంది మృతి


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులు విశ్వవ్యాప్తంగా విరుచుకుపడుతున్నారు. తాము స్థావరంగా ఎంచుకున్న సిరియాను పూర్తి స్థాయిలో తమ అధీనంలోకి తీసుకునే చర్యల్లో భాగంగా అక్కడ భీకర దాడులకు పాల్పడుతున్నారు. సిరియాలోని హస్కా ప్రావిన్స్ లో నేటి ఉదయం జనం రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని ఐఎస్ ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో పేట్రేగిపోయారు. ఈ దాడిలో 60 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 80 మంది దాకా గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుర్దిష్ మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిరియాలోని అమెరికా సంకీర్ణ బలగాలకు కుద్దిష్ మిలిటరీ సహకారం అందిస్తుందన్న కారణంగానే ఐఎస్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News