: విజయరామారావును టీఆర్ఎస్ లోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్
మాజీ మంత్రి, మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు టీఆర్ఎస్ లో చేరడం ఇక లాంఛనమే. ఆయనను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించడానికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళుతున్నట్టు సమాచారం. బంజారాహిల్స్ లోని విజయరామారావు నివాసానికి వెళ్లి, గులాబీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. విజయరామారావు స్థాయి, హోదాలను దృష్టిలో ఉంచుకుని ఆయనను సగౌరవంగా ఆహ్వానించబోతున్నారు. మరోవైపు, విజయరామారావుతో కొందరు టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని... ఈ నేపథ్యంలోనే, టీడీపీకి ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది. హైదరాబాదులో విద్యాధికులు ఎక్కువగా ఉన్న క్రమంలో... విజయరామారావు లాంటి నేతలు పార్టీలో ఉంటే బాగుంటుందని టీఆర్ఎస్ భావిస్తోంది.