: శోకాన్ని వీడి...దాతృత్వం బాటలో ప్యారిస్: ‘షేర్ ఫర్ చెన్నై’ పేరిట విరాళాల సేకరణ
కరుడుగట్టిన ఐఎస్ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వాసులు వణికిపోయారు. ఏకంగా 130 మంది సహచరులను కోల్పోయి తీరని శోకంలో మునిగిపోయారు. ఇక ఉగ్రవాదుల పేరిట పోలీసులు రోజుల తరబడి నగరంలో జరిపిన సోదాలతో బెంబేలెత్తిపోయారు. ఇదంతా మొన్నటి వరకే. ఇప్పుడు వారు పూర్తిగా మారిపోయారు. విడతల వారీగా విరుచుకుపడ్డ వరుణ దేవుడి ప్రతాపానికి జల సంద్రంలో చిక్కుకున్న చెన్నై వాసుల వెతలు వారిని కలచివేశాయి. ఇంకేముంది, శోకాన్ని వదిలి దాతృత్వం బాట పట్టేశారు. ‘షేర్ ఫర్ చెన్నై’ పేరిట విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ‘వరద బాధితులకు ఓ పూట భోజనం’ పేరిట ప్యారిస్ వాసులు ప్రారంభించిన ఈ ప్రచారానికి భారీ స్పందన లభిస్తోంది. వెరసి చెన్నై వాసులకు ధీమా లభిస్తోంది.