: సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు: కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నియమావళి అమలులో ఉండగా 'కల్యాణలక్ష్మి' పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేస్తామంటూ సీఎం ప్రకటించడం కోడ్ ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పేదలకు వస్త్రాల పంపిణి, క్రిస్మస్ డిన్నర్ వేడుకలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మెస్ ఛార్జీల రీయింబర్స్ మెంట్, పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో వయోపరిమితిని తగ్గించటం మొదలైన ప్రకటనలను అధికారంలో ఉన్న టీర్ఎస్ చేసిందంటూ కమిషనర్ కు వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. పరిశీలించిన కమిషన్ ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని హితవు పలికింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తపస్ కుమార్ కేసీఆర్ కు అడ్వైజరీ ఆర్డర్ ఇచ్చారు.