: విజయవాడ చేరుకున్న తెలంగాణ హోంమంత్రి నాయిని, సీఎస్ రాజీవ్ శర్మ
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు నగరంలోని ఓ హోటల్ లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనేందుకు వారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే నాయిని, సీఎస్ లు అమరావతిని సందర్శించారు. తొలిసారి అమరావతి రావడం సంతోషంగా ఉందని నాయిని అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు కలసి ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ సమస్యలను ఈ సదస్సులో ప్రస్తావిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పని ఒత్తిడిలో ఉన్నందున దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు రాలేకపోతున్నట్టు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది.