: ‘సత్యం’ రాజులను 14 ఏళ్లు జైల్లో పెట్టాలి... కోర్టులో సీబీఐ రివ్యూ పిటిషన్


ఇన్వెస్టర్లను నట్టేట ముంచడంతో పాటు దేశీయ ఐటీ రంగం పరువును గంగలో కలిపిన సత్యం కంప్యూటర్స్ యజమానులు సత్యం రామలింగరాజు సహా ఆయన సోదరులను 14 ఏళ్ల పాటు జైల్లో పెట్టాలని సీబీఐ కోరింది. ఈ మేరకు నిన్న నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కేసులో దోషులుగా తేలిన రామలింగరాజు సహా 9 మందికి అన్ని నేరాలకు కలిపి ఒకేసారి శిక్ష అమలు చేయాలని కోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఈ లెక్కన దోషులు ఏడేళ్లు జైల్లో ఉంటే సరిపోతుంది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీబీఐ సదరు తీర్పును పున:పరిశీలించాలని కోర్టును కోరింది. చిన్న పెట్టుబడిదారులను నట్టేట ముంచిన ‘సత్యం’ నేరగాళ్లను కనీసం 14 ఏళ్ల పాటైనా జైల్లో పెట్టాలని సదరు పిటిషన్ లో కోరింది.

  • Loading...

More Telugu News