: గోదాట్లోకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు జల సమాధి
కాకినాడ సమీపంలోని యానాంలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గోదావరి తీరంపై వేగంగా దూసుకెళుతున్న కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు జల సమాధి అయ్యారు. నిన్న రాత్రి యానాంలోని దరియాల తిప్ప ఏటిగట్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై కాస్తంత ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు నేటి ఉదయం నదిలో నుంచి కారును బయటకు తీయించారు. కారులో నుంచి ఐదుగురి మృతదేహాలు బయటపడటంతో పోలీసులు షాక్ తిన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ తోనే కారు ఉన్న నేపథ్యంలో మృతులు కూడా ఏపీకి చెందిన వారే అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.