: 'తడాఖా' ఆడియో రిలీజ్
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య, సునీల్ హీరోలుగా వస్తున్న 'తడాఖా' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతోంది. శిల్పకళాతోరణం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, హీరోలు నాగ చైతన్య, సునీల్, హీరోయిన్ తమన్నా, బ్రహ్మానందం, నిర్మాత బెల్లంకొండ సురేష్ తదితరులు హాజరయ్యారు.
తమిళంలో హిట్టయిన 'వేట్టై' కు రీమేక్ అయిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా నాయికలుగా నటిస్తున్నారు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ఫేమ్ కిశోర్ కుమార్ పర్దాసాని దర్శకత్వంలో శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది వరుస చిత్రాలతో దూసుకెళుతున్న ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సీడీలను మార్కెట్లో విడుదల చేయనున్నారు.