: అండర్ వరల్డ్ డాన్ ను భారత్ కు తీసుకువస్తాం!... సీబీఐ డైరెక్టర్ ఉద్ఘాటన


భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను దేశానికి తీసుకువస్తామని సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా ఉద్ఘాటించారు. ‘అజెండా ఆజ్ తక్’ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన నిన్న ఈ మేరకు ప్రకటించారు. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేశామని, త్వరలోనే ఈ యత్నాలు ఫలిస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిగా ఉన్న దావూద్, ఆ దాడి తర్వాత పాకిస్థాన్ వెళ్లి తలదాచుకున్నాడు. దావూద్ ను భారత్ కు తీసుకువచ్చేందుకు ఇప్పటిదాకా చేస్తున్న యత్నాలు ఏమాత్రం ఫలించలేదు. దీనిపై స్పందించిన అనిల్ సిన్హా, దావూద్ ను అరెస్ట్ చేసి తీసుకువస్తామని పేర్కొన్నారు. మాఫియా డాన్ చోటా రాజన్ లొంగిపోలేదని, తామే అతడిని అరెస్ట్ చేశామని కూడా అనిల్ సిన్హా చెప్పారు. ఇందుకోసం ఆరు నెలల పాటు తాము కష్టపడ్డామని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News